- Advertisement -

సినిమాల్లో “ఆంటీ” పాత్రలు పోషించే ప్రగతి రియల్ లైఫ్ లో ట్రెండీ. ఆమె డైలీ యోగ చేస్తారు. బోల్డ్ గా డ్రెస్సింగ్ చేస్తారు. తెరపై సాంప్రదాయ పాత్రలు, కట్టుబొట్టు. రియల్ లైఫ్ లో అల్ట్రా మోడరన్. అలాగే, ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో రకరకాల కొటేషన్లు, ఫోటోషూట్ ఫోటోలు షేర్ చేస్తుంటారు.
“నీ రోజువారీ అలవాట్లను మార్చుకోనంతవరకు… నీ జీవితాన్ని మార్చలేవు. విజయం పొందడం వెనకున్న రహస్యం నువ్వు నిత్యం చేసే పని, అలవాట్లలోనే ఉంది.”
అలాంటిదే ఒక కొటేషన్ లేటెస్ట్ గా ప్రగతి నుంచి వచ్చింది. జీవితంలో గెలుపు సాధించాలి అంటే ఏమి చెయ్యాలో చెప్తున్నారు.
ఇది ప్రగతి మాట. మీరు ‘ప్రగతి బాటలో’ వెళ్లాలంటే ప్రగతి మాట వినండి మరి.