కలెక్టర్ పాత్రలో ప్రగ్యా!

Pragya

ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు పెట్టి అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ… ప్రగ్య జైస్వాల్. ‘కంచె’ సినిమాతో మొదట మంచి క్రేజ్ తెచ్చుకొంది. కానీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేదు. ఇక ఆమెకు అవకాశాలు రావడం కష్టమే అనుకున్న తరుణంలో బాలయ్య సినిమా దక్కింది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న బోయపాటి చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్. మరో భామగా పూర్ణ నటిస్తోంది. ఇంతకీ ప్రగ్య జైస్వాల్ పాత్ర ఏంటనుకుంటున్నారు? సాదాసీదా గ్లామర్ రోల్ కాదు. ఆమె ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో కనిపిస్తుంది.

“సర్రైనోడు” సినిమాలో క్యాథెరిన్ ని ఎమ్మెల్యేగా చూపించిన బోయపాటి ఈ సినిమాలో హీరోయిన్ ని కలెక్టర్ గా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కలెక్టర్ తో బాలయ్య లవ్ స్టోరీ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రగ్యాకి ఇది మంచి పాత్ర, బిగ్ బూస్టప్ ఇచ్చే మూవీ.

Also Check: Pragya Jaiswal Photos

Advertisement
 

More

Related Stories