ప్రకాష్ రాజ్ లోకల్: సుమన్

పుట్టింది తమిళనాడులో కానీ సుమన్ ఇప్పుడు పక్కా లోకల్. మన తెలుగు వారు. ఇంకా చెప్పాలంటే సుమన్ తెలంగాణవాది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ గురించే మాట్లాడేందుకు జంకుతున్న టైంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బలంగా మద్దతు ఇచ్చిన నటుడు సుమన్. అలాంటి సీనియర్ నటులు సుమన్ మద్దతు ప్రకాష్ రాజ్ కి దక్కింది.

‘మా’ ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ రగడ జరుగుతోంది. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ లోకల్ కాదని వివాదం రేపారు. దాంతో, సుమన్ తాజాగా స్పందించారు. “సినిమా నటులకు లోకల్, నాన్ లోకల్ అనేది వుండదు. నటులకు అన్ని ప్రాంతాలు సమానమే. అన్ని రాష్ట్రాలు సొంతమే. భారతదేశంలో పుట్టిన వారు ఎవరైనా దేశంలోని ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా లోకలే,” అని క్లారిటీగా చెప్పారు సుమన్.

ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపారు సుమన్.

Advertisement
 

More

Related Stories