పలుకుబడి ఉపయోగిస్తున్న ప్రియాంక

- Advertisement -


ప్రియాంక చోప్రా గతంలో ఎన్నో సర్జరీలు చేయించుకొంది. అందంగా కనిపించాలని కాస్మెటిక్ సర్జరీలకు అంగీకరించింది. ఇప్పుడు గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు ఆమెకి ఆ అవసరం లేదు. 38 ఏళ్ల ఈ సుందరి ఇకపై వయసుకు తగ్గట్లు కనిపిస్తాను అంటోంది. ఎప్పుడూ సెక్సీగా ఉండాలని ఇక తాపత్రయ పడదంట.

“వయసును దాచలేం. ఫిట్ గా ఉండాలి… కానీ అనవసరంగా యంగ్ గా కనిపించాలని కాస్మెటిక్ సర్జరీ ప్రయత్నాలు చెయ్యను,” అని అంటోంది. అమెరికన్ నటుడు, పాప్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లాడింది ప్రియాంక. అమెరికాలో భర్తతోనే ఉంటోంది.

ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ లో భారత్ కి అంతర్జాతీయంగా అందాల్సిన సాయం చేకూరేలా ఆమె తన వంతు ప్రయత్నం చేస్తోంది. తనకున్న పలుకుబడి, పాపులారిటీని ఉపయోగిస్తూ ట్వీట్లులు వేస్తోంది.

 

More

Related Stories