అండర్వేర్ చూపించుమన్నాడు: ప్రియాంక చోప్రా

- Advertisement -
Priyanka Chopra


ప్రియాంక చోప్రా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కున్న కాస్టింగ్ కౌచ్ వివరాలు, అవమానాలు, ఇతర సమస్యలను ఇప్పుడు జనాలకు తెలియచేస్తున్నారు. తాజాగా ఆమె ఒక బాలీవుడ్ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరుని బయటపెట్టారు.

“కెరీర్ ప్రారంభంలో ఒక దర్శకుడు సినిమా షూటింగ్ లొకేషన్ లోనే ఘోరంగా అవమానించాడు. నా అండర్వేర్ చూపించుమన్నాడు. సన్నివేశం ప్రకారం నేను ఆ సీన్ లో ఒక్కో డ్రెస్ ని మెల్లగా విడుస్తున్నట్లు నటించాలి. కాసేపు అయ్యాక ఆ దర్శకుడు మొత్తం బట్టలిప్పేసి అండర్వేర్ తో నిలుచో అన్నాడు,” అని తెలిపారు ప్రియాంక.

“నువ్వు పాంటీ, బ్రా చూపించకపోతే నీ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎందుకు వస్తారు,” అని కూడా కామెంట్ ఆ దర్శకుడు కామెంట్ చేశాడట. అమానవీయ పద్దతిలో నటించమని అడిగాడు అని ఆమె ఏకరవుపెట్టారు.

ఐతే, ఆ దర్శకుడు పేరు వివరించలేదు. ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో పాటు ఒక హాలీవుడ్ మూవీలో నటించారు. వాటి ప్రమోషన్ లలో పాల్గొంటున్నారు.

 

More

Related Stories