జనసేనలో ఛత్రపతి ప్రసాద్

TeluguCinema 12 Jun 2023
bvsnprasad

‘ఛత్రపతి’, ‘అత్తారింటికి దారేది’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలు నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్రసాద్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన తాజాగా జనసేన పార్టీలో చేరారు.

ఈ రోజు ఆయన మంగళగిరి వెళ్లి పార్టీ కండువా వేసుకున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం యాగం చేపట్టారు. మంగళగిరిలో జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యాగం మొదలైంది. అక్కడికి వెళ్లి బీవీఎస్ ఎన్ ప్రసాద్ పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీలోకి హైపర్ ఆది వంటి నటులు చేరారు. ఐతే, సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా పవన్ పార్టీలోకి రాలేదు. ఇప్పుడు మెల్లగా అది కూడా మొదలవుతుంది.

ఐతే, బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలి.