- Advertisement -

“పుష్ప 2” షూటింగ్ నెమ్మదిగా, నిదానంగా జరుగుతోంది. ఎందుకంటే ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది ఆగస్టులో. ఇంకా 10 నెలల టైం ఉంది షూటింగ్ పూర్తి చేసేందుకు. అందుకే, అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఎక్కువ బ్రేకులు తీసుకుంటున్నారు.
తాజగా సుకుమార్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఇక హీరో అల్లు అర్జున్ వరుణ్ తేజ్ వెడ్డింగ్ కోసం ఇటలీ వెళ్లారు. ఇద్దరూ తిరిగి వచ్చాకే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.