‘పుష్ప’లో ట్విస్ట్ అదిరిపోతుందట!

TeluguCinema 14 Jun 2021
Pushpa


దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా విడదీయాలని తీసుకున్న నిర్ణయం ఆషామాషీగా జరగలేదు. మొదటి భాగం చివర్లో ఎలాంటి “హుక్” ఉండాలో అలాంటిది దొరికిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నారట. అంటే… రెండో భాగంలో ఏమి అవుతుంది? మొదటి భాగంలో అలా ఎందుకు జరిగింది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగే ట్విస్ట్ ఉందట.

ఆ ట్విస్ట్ మీదే ఈ సినిమా కథ అంతా ఆధారపడి ఉందని టాక్. అందుకే… ‘పుష్ప’ని రెండు భాగాలుగా విడదీశారు.

ఐతే, రెండో భాగానికి కావాల్సిన స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. ‘బాహుబలి’ మొదటి పార్టుకి వచ్చిన అనూహ్య ప్రతిస్పందన చూసి రాజమౌళి, రెండో భాగం కథలో చాలా మార్పులు చేసినట్లే… సుకుమార్ కూడా మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాతే అలోచిస్తారట.

ఇక మొదటి భాగంలో మిగిలిన షూటింగ్ ని వచ్చేనెలలో తీసే అవకాశం ఉంది. షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలు పెట్టాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ అగ్రనటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రష్మిక హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మస్తోంది.