మస్త్ కలందర్ రాశి!

Raashi Khanna

రాశి ఖన్నాకి మంచి టాలెంట్ ఉంది. అందం కూడా అదుర్స్. అన్ని ఉన్నా… ఎందుకో టాప్ లీగ్ హీరోయిన్ కాలేకపోయింది. ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ లోనే. అందుకే, ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచుతోంది. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలన్నీ ఎక్కువగా గ్లామరస్ గానే ఉంటున్నాయి. ఆమె ఒంపుసొంపుల ప్రదర్శన మస్త్ కలందర్.

ఇక ఈ రోజు ఏకంగా బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఇంకా ఎండాకాలం రాకముందే స్విమింగ్ డ్రెస్ వేసుకొని ఆ అందచందాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కనువిందు కలిగిస్తోంది. ఇంత అందాన్ని పట్టించుకోకపోతే ఎలాగా చెప్పండి. మన ఫిలిం మేకర్స్ అటు ఇటు చూడకుండా ఈ అందాల రాశిని హీరోయిన్ గా బుక్ చేసుకోవాలి.

ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో గోపీచంద్ సరసన నటించనుంది. తమిళ్ లో ఒక మూవీ, మలయాళంలో ఒకటి, బాలీవుడ్ లో మరోటి చేస్తోంది. తెలుగులోనే పెద్దగా ఆఫర్లు రావట్లేదు ఎందుకో మరి. 

More

Related Stories