మహేష్ తో మల్టీస్టారర్ కాదు!

- Advertisement -
Mahesh Multi

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఆగిపోయిందని, ఆ స్థానంలో రాజమౌళి అల్లు అర్జున్ తో మూవీ చేస్తాడని ఈ మధ్య పనిలేని గ్యాంగ్ ఒక ప్రచారం లేపింది. ఆ తర్వాత మహేష్ బాబు సినిమాలో ఇంకో హీరో కూడా ఉంటాడనే పుకారు లేపారు. వీటిపై రాజమౌళి పెదవి విప్పకతప్పలేదు.

శనివారం బెంగుళూరులో జరిగిన మీడియా మీట్ లో రాజమౌళి ఈ ఊహాగానాలకు తెరదించారు. మహేష్ బాబుతోనే తన తదుపరి చిత్రం అని చెప్పారు. అది మల్టీస్టారర్ కాదనే క్లారిటీ కూడా వచ్చింది. “మహేష్ బాబు ఒక్కరే హీరో అందులో,” అని రాజమౌళి తెలిపారు.

మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఇక, జూన్ లో త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరినాటికి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా మొదలుపెడుతారన్నమాట.

మహేష్ బాబుతో సినిమాని రెండు, మూడేళ్లు సాగదీయకుండా స్పీడ్ గా పూర్తి చెయ్యాలని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్.

More

Related Stories