
రాజమౌళి వల్లే ప్రభాస్ కి పాన్ ఇండియన్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. ప్రభాస్ – రాజమౌళి స్నేహబంధం మామూలుది కాదు. రాజమౌళి అంటే ప్రభాస్ ఎంత గౌరవమిస్తారో, ప్రభాస్ అన్నా అంతే అభిమానం చూపుతారు రాజమౌళి
అందుకే, ప్రభాస్ ఎప్పుడు అడిగినా రెడీగా ఉంటారు ప్రొమోషన్ కోసం.
“సలార్” సినిమాకి సంబంధించి మొదటి ఇంటర్వ్యూ రాజమౌళితోనే మొదలు కావడం విశేషం. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూతోనే ప్రభాస్ “సలార్” ఇంటర్వ్యూల సెషన్ స్టార్ట్ చేశారు.
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో తీయనున్నారు. ఆ తర్వాత ఎవరితో అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ఐతే, మళ్ళీ ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్ ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఐతే, ప్రభాస్ ప్రతి పెద్ద సినిమా పబ్లిసిటీకి రాజమౌళి మాత్రం కచ్చితంగా వస్తున్నారు.