ప్రభాస్ తో నటిస్తున్న రాజమౌళి!

Rajamouli

“బాహుబలి”తో ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన దర్శకుడు రాజమౌళి. ఆ సినిమాలో రాజమౌళి చిన్న పాత్రలో కనిపిస్తారు. ఇక “ఆర్ ఆర్ ఆర్
సినిమాలో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఒక పాటలో డ్యాన్స్ చేశారు రాజమౌళి. “తెరపై కనిపించాలనే” ఆలోచన రాజమౌళికి మొదటి నుంచి ఉంది. కానీ, ఆయన చాలా తక్కువ సినిమాల్లోనే కన్పించారు.

ఇప్పుడు ఒక కొత్త సినిమాలో ఆయన అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారట. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న “కల్కి 2898 AD” చిత్రంలో ప్రభాస్ ప్రత్యేక పాత్ర పోషిస్తారు అని టాక్. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెడుతారట. అంటే ప్రభాస్ తో రాజమౌళి నటిస్తారు.

“కల్కి” చిత్రంలో ప్రభాస్ తో పాటు దీపిక పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశ పటాని కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి కూడా ఈ సినిమాలో చేరితే గ్లోబల్ లెవల్లో ఇంకా ఎక్కువ ప్రచారం లభిస్తుంది. ఎందుకంటే, “ఆర్ ఆర్ ఆర్” సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీ వరకు రాజమౌళి పేరు పాకింది.

“కల్కి” చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories