హీరో రాజశేఖర్‌ కి పితృవియోగం!

Admin 04 Nov 2021
Rajasekhar


దీపావళి పండుగనాడే హీరో డా.రాజశేఖర్‌ ఇంట్లో విషాదం. ఆయనకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం కన్నుమూశారు.

గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

వరదరాజన్‌ గోపాల్‌ చెన్పై డీసీపీగా రిటైర్‌ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వరదరాజన్‌ గోపాల్‌కు హీరో రాజశేఖర్‌ రెండో సంతానం. శుక్రవారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.