ఉపాసన ముందు తగ్గి ఉంటా: చరణ్

TeluguCinema 24 Apr 2022
Ram Charan and Upasana

‘ఆచార్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడిగిన ఫన్నీ ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు. శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది ఈ ఈవెంట్. మీ నాన్నగారు, ఉపాసన… ఇద్దరిలో ఎవరికీ ఎక్కువగా భయపడతారు అన్న ప్రశ్నకు చరణ్ నుంచి కొంటె జావాబు వచ్చింది.

“ఇంట్లో మా నాన్న గారు మా అమ్మ ముందు తగ్గి ఉంటారు. మా ఇంట్లో అందరికీ బాస్ మా అమ్మే. మా నాన్నకి అయినా, మా కళ్యాణ్ బాబాయ్ కైనా, నాకు అయినా. నేను కూడా మా నాన్నని చూసే నేర్చుకున్నా… సో ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటా,” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు చరణ్.

చిరంజీవి వెంటనే అందుకొని చరణ్ కి ఇంకో సలహా ఇచ్చారు: “అయితే సుఖపడుతావు. వాళ్ళతో (ఆడవాళ్ళతో) పెట్టుకోవద్దు.”

ఇక చిరంజీవి తన తల్లి చేసిన వంటే ఇస్తామని తెలిపారు. అలాగే, చిరంజీవికి చేపల పులుసు అంటే చాలా ఇష్టమట.