ఇప్పుడు చరణ్ ఏమిచెయ్యగలడు?

TeluguCinema 23 Jul 2021
Ram Charan in Acharya


రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం వచ్చే నెలలో లాంఛనంగా మొదలు కానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ ని ఎలాగైనా వాయిదా వేసేలా తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నిస్తోందట. ఇప్పటికే లైకా కోర్టులో ప్రయత్నించి ఓడిపోయింది. ఇప్పుడు, నిర్మాత దిల్ రాజుపై ఒత్తిడి పెడుతోందట.

మీడియాలో కథనాల ప్రకారం ఆ తమిళ నిర్మాణ సంస్థ దిల్ రాజుపై ఎమోషనల్ గా ప్రెజర్ పెడుతోందట. తమ 170 కోట్లు ఆగిపోయాయి అని, ఒక నిర్మాత బాధని అర్థం చేసుకోవాలని అడుగుతోంది ఆ సంస్థ . ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చెయ్యకుండా శంకర్ సతాయిస్తున్నారు. ఆ సినిమా మీద ఇప్పటివరకు ఖర్చు పెట్టిన 170 కోట్లు వేస్టు అవుతాయి. అందుకే, ఆ నిర్మాణ సంస్థ దిల్ రాజుని కోరుతోంది. కానీ, దిల్ రాజు ఇప్పుడు చేసేది ఏమీలేదు.

శంకర్ తో ఈ విషయాలన్నీ ఇప్పటికే చరణ్, దిల్ రాజు అన్ని కూలంకషంగా చర్చిందారు. అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు శంకర్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ అయ్యాయి.

లైకా సంస్థ ఈ పని ఇంతకుముందే చేసి ఉండాల్సింది. ఇప్పుడు చరణ్ ఏమి చెయ్యలేడు. దిల్ రాజ్ చేతిలోనూ ఏమిలేదు.