అభిమానులకు బాగా నచ్చింది!

మూడు నెలల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ షూటింగ్ సెట్లొకి వచ్చారు.ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో మొదటి రోజు షూటింగ్ కి వచ్చే ముందు తన మీసాలు, హెయిర్ స్టైల్ ని తన పాత్రకు తగ్గట్లు సెట్ చేయించుకున్నారు రామ్ చరణ్. ఆ టైంలో దిగిన ఫోటోని హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీమ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై షేర్ చెయ్యగా,, అది వేల లైకులు అందుకొంది.

అంతేకాదు, అభిమానులు హకీమ్ ఉన్న భాగాన్ని కత్తిరించి, కేవలం రామ్ చరణ్ సగం ముఖాన్ని తమ డీపీలకు తగిలించుకుంటున్నారు. అభిమానులకు ఈ ఫోటో బాగా నచ్చింది.

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ తో పాటు రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ కూడా పూర్తి చెయ్యాలి. ఈ రెండింటికి గుమ్మడికాయ కొట్టడమే అతని టార్గెట్. ఆ తర్వాతే వేరే సినిమాల గురించి ఆలోచిస్తారు.

Advertisement
 

More

Related Stories