ఆర్జీవీ స్టయిలే వేరు: మోహన్ లాల్

TeluguCinema 24 Sep 2025
RGV

ఇటీవల మోహన్ లాల్ ని కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. భారతీయ సినిమా ప్రపంచంలో ఇది అత్యుత్తమ అవార్డు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మోహన్ లాల్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

“ఫాల్కే మొదటి భారతీయ సినిమా (“రాజా హరిశ్చంద్ర” ) సినిమా తీశారనే మాట నిజమే అయినా ఆయన సినిమా ఎవరూ చూడలేదు, ఆ సినిమా చూసిన వారిని నేను కలవలేదు. నిజానికి ఫాల్కేకే మోహన్ లాల్ అవార్డు ఇవ్వాలి,” అంటూ తనదైన శైలిలో ఆర్జీవి పోస్ట్ చేశారు.

ఫాల్కేకి మీ పేరు మీద అవార్డు ఇవ్వాలన్న ఆర్జీవీ మాట గురించి మోహన్ లాల్ ని అడిగితే ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

“రామ్ గోపాల్ వర్మ మిగతా వాళ్లకు భిన్నంగా స్పందిస్తారు. ఆయనది బ్లాక్ హ్యూమర్ పద్దతి. ఆయన స్టయిలే వేరు. దాన్ని ఫన్నీగా తీసుకోవాలి. అతనితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన తీసిన కల్ట్ సినిమాల్లో ఒకటి… కంపెనీ. అందులో నేను నటించాను,” అంటూ మోహన్ లాల్ రెస్పాండ్ అయ్యారు.

TeluguCinema

View all posts

Recent News