వర్మ కొత్త భామ…. పగోజి పిల్ల

Sweety

రామ్ గోపాల్ వర్మ మరో కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాడు. ఈ కొత్త భామ పేరు… స్వీటీ. అనుష్క శెట్టి అసలు పేరు.. స్వీటీ కానీ ఆ పేరు వెండితెరకి సూట్ కాదని అనుష్కగా మార్చుకొంది. ఇప్పుడు ఈ స్వీటీ వచ్చింది.

ఈ భామ… పశ్చిమ గోదావరి జిల్లా (పగోజి) దేవరపల్లికి చెందిన అచ్చ తెలుగు యువతి అంట. ఈ విషయాన్నీ వర్మ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. ఐతే, ఆమెని ఇంట్రడ్యూస్ చూస్తూ ట్విట్టర్ లో పెట్టిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఆమె ఇచ్చిన పోజులు శృతి మించాయి మరి. వర్మ ఇటీవల వెబ్ సినిమాలు తీస్తున్నాడు. “క్లైమాక్స్” పేరుతో ఒక సినిమా తీసి ఈ లక్డౌన్ లో వెబ్ లో విడుదల చేశాడు. 100 రూపాయల టికెట్ తో “ఆర్జీవీ వరల్డ్” అప్ లో ఆ మూవీని జనం ఎగపడి చూశారు.

ఇప్పుడు రెండో సినిమాగా “నేకెడ్”(నగ్నం) విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న భామ… స్వీటీ. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ డోస్ ఎక్కువ ఉంది. అందుకే దీనికి 200 రూపాయలు ఫిక్స్ చేశాడు.

Related Stories