ఇండియా తిరిగొచ్చిన రామ్

అమెరికాలో తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలన్న ఆలోచనతో రామ్ పోతినేని సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు ఇండియా వదిలి వెళ్లారు. “ఆంధ్ర కింగ్ తాలూకా” సినిమా ప్రీమియర్ షోలకు డల్లాస్ వెళ్ళాడు. ఐతే, సినిమాకి మంచి టాక్ వచ్చినా ఇక్కడ కలెక్షన్లకి ఇబ్బంది వచ్చింది.
ఇండియాలో సినిమాని ఎక్కువగా పుష్ చెయ్యాల్సిన టైంలో అమెరికా వెళ్లడం ఏంటి అనే కామెంట్స్ రావడంతో రామ్ తన టూర్ ని ఇంకా పొడగించలేదు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ రోజు నుంచి మళ్లీ ప్రమోషన్ మొదలుపెట్టాడు.
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్స్ నటించిన “ఆంధ్ర కింగ్ తాలూకా”కి మంచి రివ్యూస్ వచ్చాయి. టాక్ కూడా బాగుంది. కానీ సినిమా మాత్రం ఒక స్థాయి దాటలేకపోయింది. ముఖ్యంగా వీకెండ్ సమయంలో పెరగాల్సిన కలెక్షన్ గ్రోత్ కనిపించలేదు. దాంతో, హీరో ముందు ఉండి ప్రమోషన్ చెయ్యాల్సిన అవసరం పడింది. అందుకే, రామ్ ఏమి ఆలోచించకుండా ఇండియా వచ్చి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాడు.
పీ. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.