రామబాణం ఫ్యామిలీ మూవీ: శ్రీవాస్‌

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న మూవీ ‘రామబాణం’. ఈ సినిమా ఈ నెల 5న విడుదల అవుతోంది. ఇది ఒక ఫ్యామిలీ చిత్రం అని అంటున్నారు శ్రీవాస్.

“లక్ష్యం, లౌక్యం సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. దానికి కారణం ఆ సినిమాని మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆదరించారు. ఈసారి కూడా అలాంటి కథ ఉండాలనుకున్నాం. అన్నదమ్ముల అనుబంధం మీద ఓ కొత్త పాయింట్ దొరికింది. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం,” అని అన్నారు శ్రీవాస్.

“ఈ సినిమాకి లక్ష్యం 2 అని వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ బాలయ్య గారు రామబాణం అనే పేరు సజెస్ట్ చేశారు. అది మాకూ నచ్చింది. అలా ఈ మూవీ టైటిల్ కుదిరింది,” అని తెలిపారు శ్రీవాస్.

ఈ సినిమాలో ఆర్గానిక్ ఫుడ్ గురించి చెప్పారు. “ఆర్గానిక్ ఫుడ్ అనేది లోతైన సబ్జెక్ట్. మేం కథకు కావాల్సినంత మేరకే చర్చించాం,” అని అన్నారు.

“రామబాణం సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఆ గ్రాండ్ నెస్ అంతా తెరపై మీరు చూస్తారు.”

Advertisement
 

More

Related Stories