అటు అమ్మ, ఇటు పోలీసు!

Ramyakrishna

పూరి జగన్నాధ్ బ్యాక్ టు బ్యాక్ తాను నిర్మిస్తున్న చిత్రాల్లో సీనియర్ నటి రమ్యకృష్ణకి మంచి పాత్రలు ఇచ్చారు. ‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ అమ్మగా రమ్యకృష్ణని తీసుకున్నారు పూరి. ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయనే. ఇక తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ఆయన నిర్మిస్తున్న ‘రొమాంటిక్’ మూవీలో కూడా రమ్యకృష్ణకి మెయిన్ రోల్ దక్కింది.

‘రొమాంటిక్’ సినిమాలో ఆమె ఒక పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఒక సినిమాలో కరుణ చూపే తల్లి, మరో సినిమాలో కఠినంగా కనిపించే పోలీసు… ఇలా వైవిధ్యమైన పాత్రలు ఆమె కోసం పూరి రాయడం విశేషం.

రమ్యకృష్ణ హీరోయిన్ గా పూరి సినిమాలు తీయలేదు. కానీ ఆమెకి ఇప్పుడు మంచి పాత్రలు ఇస్తున్నారు. నిజానికి ‘రొమాంటిక్’ సినిమాలో రమ్యకృష్ణ స్థానంలో మరో నటిని తీసుకొని తీశారు. కానీ ఆమె నటన నచ్చక… ‘లైగర్’ షూటింగ్ లో ఉన్న రమ్యకృష్ణకి కథ చెప్పి ఒప్పించి ‘రొమాంటిక్’ సినిమాలో ఆ పోలీసు పాత్ర చేయించారు.

రమ్యకృష్ణ ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకొనే లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్.

Advertisement
 

More

Related Stories