రష్మిక బాటలో కీర్తి సురేష్


రీసెంట్ గా రష్మిక గ్లామర్ డోస్ పెంచింది. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది రష్మిక, ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది. దాంతో అక్కడి పద్దతికి తగ్గట్లు మేకోవర్ చేయించుకుంది. మాంచి గ్లామర్ షోతో కుర్రకారుని మరింతగా ఆకట్టుకుంటోంది. నిత్యం జిమ్ కి వెళ్తూ టిప్ టాప్ గా మారిపోయింది రష్మిక.

కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఏ సినిమా చెయ్యడం లేదు కానీ ఈ అమ్మడు కూడా కొంచెం మారిపోయింది. మేకోవర్ చేయించుకొని మెల్లగా గ్లామర్ రూట్లోకి వస్తోంది. కీర్తి సురేష్ తన అందాల మెరుగుకు యోగాని నమ్ముకొంది. రష్మిక కన్నా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ ఫోటోలు షేర్ చేస్తోంది. రకరకాల ఫోటోషూట్స్ తో కీర్తి సురేష్ కిరాకు పుట్టిస్తోంది

చూడండి: కీర్తి సురేష్ కొత్త ఫోటోలు

రష్మిక చేతిలో తెలుగులో రెండు సినిమాలున్నాయి. అవి… పుష్ప, ఆడవాళ్ళూ మీకు జోహార్లు. ఇక, కీర్తి సురేష్ చేతిలో ‘సర్కారు వారి పాట’, ‘అన్నత్థే’ ఉన్నాయి. అలాగే, ‘గుడ్ లక్ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది.

చూడండి: రష్మిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Advertisement
 

More

Related Stories