రష్మిక జోరు తగ్గుతుంది కానీ

రష్మిక వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే ఆమెకి విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగింది. మరో మూడు నెలల్లో ఆమె పెళ్లి. మరి పెళ్లి తర్వాత రష్మిక సినిమాలు చేస్తుందా? లేక మానేస్తుందా? ఒకవేళ కంటిన్యూ చేసినా సినిమాల ఎంపికలో ఎలా వ్యవహరిస్తుంది?
ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఆమె అభిమానుల్లో. ఆమె టీం చెప్తున్న సమాచారం ప్రకారం ఆమె సినిమాలు మానెయ్యదు. కెరీర్ కంటిన్యూ చేస్తుంది. దీపిక పదుకోన్, అలియా భట్ లా తన కెరీర్ ని కొనసాగిస్తుందట. బాలీవుడ్ లో పలువురు హీరోయిన్లు పిల్లలను కన్న తర్వాత కూడా హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. తననుకున్న క్రేజ్ కారణంగా సినిమాల నుంచి తప్పుకోవద్దనుకుంటోంది రష్మిక. అందుకే, సినిమాల వర్క్ లోడ్ తగ్గించి కెరీర్ కంటిన్యూ చేస్తుందట.
రష్మిక ఈ ఏడాది అయిదు సినిమాలు విడుదల చేసింది. అవి: 1) చావా 2) సికిందర్ 3) కుబేర 4) తమ్మ 5) ది గర్ల్ ఫ్రెండ్.
ALSO READ: Simplicity and smiles: Rashmika Mandanna’s charm
2026లో రష్మిక చిత్రాలు
ఇక 2026లో ఆమె నుంచి మరో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. “మైసా” అనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండతో ఒక మూవీ ఉంది. అలాగే హిందీలో “కాక్ టైల్ 2” కూడా చివరి దశకు చేరుకొంది. ఇవన్నీ ఆమె ఇంతకుముందు ఒప్పుకున్నవి. ఐతే పెళ్లి తర్వాత ఏ సినిమాలు ఒప్పుకుంటుందో చూడాలి.