ఆమె తీసుకుంది సగమేనట

The Girlfriend

రష్మిక మందాన ఇప్పుడు ఇండియాలో పెద్ద హీరోయిన్లలో ఒకరు. సినిమాకి ఆరు కోట్లకుపైగా పారితోషికం అందుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకైతే ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ ఆమె ఇటీవల చేసిన ఒక సినిమాకి అందులో సగం కూడా తీసుకోలేదట.

తాజాగా ఆమె నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా విడుదలైంది. ఆమె నటనకి విపరీతమైన పేరు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ, తన పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రష్మిక … ఇది కమర్షియల్ గా బాగా ఆడుతుందా లేదా అనేది పట్టించుకోకుండా చేసిందట. అందుకే, ఆమె తన పారితోషికాన్ని తగ్గించుకొని మరీ ఈ మూవీ చేసింది.

ఆమె ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చేతిలో “కుబేర”, “చావా” వంటి భారీ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల షూటింగ్ లో పాల్గొంటూనే ఈ సినిమాకి కావాల్సినన్ని డేట్స్ ఇచ్చింది.

రష్మిక ఈ సినిమాకి కేవలం 3 కోట్లు మాత్రమే తీసుకొంది.

More

 

Related Stories