‘కాక్ టైల్ 2’తో రష్మిక బిజీ

Rashmika Mandanna

రష్మిక మందాన మరో బడా బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సారి ఈ భామ షాహిద్ కపూర్ సరసన అవకాశం దక్కించుకొంది. “కాక్ టైల్ 2” చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. తాజాగా ఇటలీలో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి.

సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకోన్, డయానా పెంటి హీరో, హీరోయిన్లుగా గతంలో వచ్చిన “కాక్ టైల్” మంచి విజయం సాధించింది. అందులో పాటలు బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు దానికి రెండో భాగం వస్తోంది. ఈ రెండో భాగంలో హీరో, హీరోయిన్లు మొత్తం మారిపోయారు.

సాహిద్ కపూర్, రష్మిక మందాన, కృతి సనన్ నటిస్తున్నారు. రష్మిక పూర్తిగా మాడ్రన్ పద్దతిలో కనిపించనుంది.

ఈ ఏడాది రష్మిక ఇప్పటికే “చావా”, “కుబేర”, “సికిందర్” సినిమాలు విడుదల చేసింది. మరో రెండు నెలల్లో “ది గర్ల్ ఫ్రెండ్”, “తమ” సినిమాలు విడుదల కానున్నాయి. ఇక వచ్చే ఏడాది “కాక్ టైల్ 2” రిలీజ్ అవుతుంది. హిందీలో ఆమె వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.

More

 

Related Stories