ప్రభాస్ తో డేట్ కి రెడీ

Rashmika

రష్మిక మందాన కూడా ఆ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. ప్రభాస్ తో డేట్ కి వెళ్ళడానికి ఎప్పుడైనా రెడీ అని చెప్పిన భామల లిస్ట్ చాంతాడంత ఉంది. ఆ జాబితాలోకి ఇప్పుడు రష్మిక వచ్చింది. ఇటీవల ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ ఇష్టాయిష్టాల గురించి మాట్లాడింది.

ఎవరితో డేట్ కి వెళ్ళమంటే ఒక్క క్షణం కూడా ఆలోంచించకుండా రెడీగా ఉంటావు అని అడిగితే ప్రభాస్ పేరు చెప్పింది ఈ ‘సరిలేరు నీకెవ్వరు’ భామ. ప్రభాస్ అంటే పిచ్చ అభిమానమంట. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోల సరసన నటించిన ఈ భామ ప్రభాస్ తో నటించే ఛాన్స్ కోసం చూస్తోంది.

ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు చిత్రాలు, తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.

Advertisement
 

More

Related Stories