పొట్టి డ్రెస్సుల్లోకి వచ్చిన రష్మిక

- Advertisement -


రష్మిక గ్లామర్ బాట పట్టి చాలా రోజులైంది. పెద్ద హీరోయిన్ అయ్యే ప్రాసెస్ లో ఈ అమ్మడు కూడా పొట్టి నిక్కర్లు వేసుకోవడం మొదలుపెట్టింది.

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాని కుటుంబ కథాచిత్రంగా చెప్తున్నారు. మొదట్లో రష్మికని సంప్రదాయ పద్దతిలో చూపించారు ప్రొమోషన్ లలో. ఎక్కువగా చీరకట్టులో కనిపించింది ప్రోమోస్. తాజాగా విడుదలైన పాటలో ఆమెలోని గ్లామర్ యాంగిల్ చూపించారు. ఈ పాటలో మొత్తంగా పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చింది.

రష్మిక మొన్నామధ్య వచ్చిన ‘పుష్ప’లో కూడా అందాల ఆరబోసింది. కాకపొతే, అది పల్లెటూరి పాత్రలో. ఈసారి మోడ్రన్ షార్ట్స్ లో తన లెగ్స్ చూపిస్తోంది.

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఈ నెల 25న విడుదల కానుంది. రష్మిక ఈ సినిమా విడుదలైన తర్వాత ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ తో బిజీగా మారుతుంది.

రష్మిక, ఆడవాళ్లు మీకు జోహార్లు

 

More

Related Stories