Advertisement
తెలుగు న్యూస్

‘నగ్మాతో ఎఫైర్ నడపలేదు’

ఒకప్పుడు నగ్మా చాలా పెద్ద హీరోయిన్. దక్షిణాది సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన నటి ఆమె. ఆమె గురించి భోజ్ పూరి హీరో తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమెతో తాను ఎప్పుడూ ప్రేమాయణం నడపలేదు అని చెప్పుకొచ్చారు రవికిషన్. ఆమెతో అనేక సినిమాల్లో హీరోగా నటించారు రవికిషన్. భోజ్ పూరి సినిమాల్లో వీరిది హిట్ జంట.

తమ సినిమాలు హిట్ కావడం, తమ మధ్య మంచి కెమిస్ట్రీ ఉండడం వల్ల జనం పొరబడ్డారు అని రవికిషన్ చెప్తున్నారు.

48 ఏళ్ల నగ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఇక రవికిషన్ బీజేపీ నాయకుడు. ఎంపీ కూడా. పార్టీలు వేరైనా తమ మధ్య స్నేహం ఉందని, కానీ మరే ఇతర బంధం లేదని పదే పదే చెప్పారు రవికిషన్.

ఇక హీరోయిన్ గా ఒకప్పుడు టాప్ స్థానంలో ఉన్నప్పుడు ఆమె క్రికెటర్ గంగూలీతో డేటింగ్ చేశారు. వాళ్లిద్దరూ శ్రీకాళహస్తిలో జంటగా పూజలు కూడా చేశారు. అప్పటికే పెళ్లయిన గంగూలీ ఆమెని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని అప్పట్లో ప్రచారం గుప్పుమంది. కానీ ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు.

ALSO READ: ‘ఆమె నన్ను నైట్ కి పిలిచింది’

Advertisement

This post was last modified on April 4, 2023 7:33 pm

Advertisement
Share