‘ఆమె నన్ను నైట్ కి పిలిచింది’

Ravi Kishan

ఫలానా హీరో తన బెడ్ రూమ్ లోకి రమ్మన్నాడు అనో, పడుకుంటేనే అవకాశం ఇస్తామని నిర్మాత అన్నాడనో, దర్శకుడు వేధించాడు అనో ఆరోపణలు మనం తరుచుగా ఉంటాం. హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు ఎక్కువ అన్నది నిజం. అలాగే, ఈ మధ్య యూట్యూ బ్, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొన్ని తప్పుడు ఆరోపణలు, నిరాధారమైన ప్రకటనలు కూడా వస్తున్నాయి.

హీరోయిన్లతో పాటు బాలీవుడ్ లో హీరోలు కూడా వేధింపులకు గురవుతారు అని అంటున్నారు. అక్కడ ‘గే’ కల్చర్ ఎక్కువ. సో, అందమైన యువకులకు హీరోయిన్లలాగే కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉన్నాయట.

ఇలాంటివి చాలా విన్నాం కానీ, ఒక నటుడు వింతగా ఒక మాట చెప్పాడు. ఒక పేరొందిన నటి తనని నైట్ కి పిలిచింది అని చెప్తున్నాడు.

భోజ్ పూరి ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్న రవికిషన్ బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ కూడా. ‘రేసుగుర్రం’ వంటి సినిమాల్లో నటించిన ఈ నటుడు బాలీవుడ్ లో పేరొందిన ఒక నటి తనని నైట్ కి రమ్మంది అని చెప్పాడు. ఆమె ఉద్దేశం అర్థం అయి అటు పోలేదంటున్నాడు.

ఐతే, రవి కిషన్ మాటలని నమ్మలేం. ఆ మధ్య తన జనాభా నియంత్రణ విషయంలో కూడా ఇలాంటి హెచ్చులు మాట్లాడాడు. ఆయనకి నలుగురు పిల్లలు. కానీ, ఇండియాలో ఎవరూ ఇద్దరి కన్నా ఎక్కువ కనొద్దు అని అంటూ ఆయన లోక్ సభలో ప్రైవేట్ బిల్లు పెట్టారు. “ఒక వర్గం వాళ్ళు ఎక్కువమంది పిల్లలను కంటున్నారు” అని ఆరోపణ చేస్తూ తనకే నలుగురు పిల్లలు ఉన్నారు అన్న విషయాన్నీ కన్వీనియంట్ గా మరిచిపోయి మాట్లాడుతుంటాడు. అట్లుంటది రవి కిషన్ తో. అందుకే, ఆ హీరోయిన్ పై రవి కిషన్ చేసిన కామెంట్స్ విషయంలో కూడా నమ్మలేమంటున్నారు నెటిజెన్స్.

Advertisement
 

More

Related Stories