సెక్స్ పిచ్చోడు కాదు ఆయనొక రిషి!

- Advertisement -
Ariyana Glory


రామ్ గోపాల్ వర్మ నిజంగా గొప్ప దర్శకుడు అందులో డౌటే లేదు. కానీ వ్యక్తిగా ఆయన్ని ఒక సెక్స్ మేనియాక్ అని అందరూ అనుకుంటారు. ఆయన కూడా అలాంటి కలరే ఇస్తారు తన ట్వీట్లతో… చేష్టలతో.

వోడ్కా, అమ్మాయిలు, సినిమాలు… ఇవే తన ప్రపంచం అన్నట్లుగా ప్రవర్తిస్తారు వర్మ. అందుకే, ఆయనకి సెక్స్ పిచ్చోడు అనే ఇమేజ్ వచ్చింది. కానీ ఆ అభిప్రాయం తప్పు అని చెప్తోంది ఆయన లేటెస్ట్ వీరాభిమాని… అరియనా గ్లోరీ. ఇటీవల అరియనా…వర్మని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో కూడా 59 ఏళ్ల వర్మ ఈ భామని అంగాంగ వర్ణన చేశారు. అలాగే, ఆమె బాడీనే చూస్తూ ఉండిపోయారు.

ఐతే, లేటెస్ట్ గా అరియనా ఆ ఇంటర్వ్యూ గురించి ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చింది. అంటే పద్యానికి తాత్పర్యంలా.

ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో అరియనా రామ్ గోపాల్ వర్మని ఒక మాడ్రన్ రిషి అని అభివర్ణించింది. “ఆయన గురించి మీకు ఏమి తెలుసు. ఆయన మన మధ్య ఉన్న రిషి,” అని హొయలు పోయింది అరియనా.

RGV with Ariyana

అంటే రామ్ గోపాల్ వర్మలో మనకి కనిపించని ‘రామ్’దేవ్ బాబా ఉన్నారా?

 

More

Related Stories