RRR: 8 నుంచి 13కి మారిందిందుకే!

RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న ‘RRR’ సినిమాని అక్టోబర్ 8 రిలీజ్ చెయ్యాలనేది నిర్మాత ప్లాన్. ఎందుకంటే…ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 15న వస్తుంది. దసరా సెలవులు వారం రోజులు ముందే మొదలవుతాయి కాబట్టి అక్టోబర్ 8 పర్ఫెక్ట్ డేట్ అని ఫిక్స్ అయ్యారు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో నటిస్తున్న ఫారిన్ నటి ఆలిసన్ డూడి గత వారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తొలిగించింది కూడా. మరి ఎందుకు అక్టోబర్ 8 నుంచి 13కి డేట్ ని మార్చారు?

అక్టోబర్ 8న రిలీజ్ చేస్తే ఈ సినిమాకి అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ, అలాగే నార్త్ ఇండియాలో కూడా థియేటర్ల సమస్య వస్తుంది. ఎందుకంటే ఆ రోజు జేమ్స్ బాండ్ కొత్త సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ‘No Time to Die’ అనే ఈ బాండ్ చిత్రం రిలీజ్ డేట్ ఇటీవలే మారింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 8కి సినిమా డేట్ ని మారుస్తున్నట్లు 3 రోజుల క్రితం ప్రకటన వచ్చింది.

దాంతో, రాజమౌళి టీం తమ సినిమాని అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 13కి మార్చారు. ఐతే, కీలకమైన దసరా సెలవుల్లో కొన్ని రోజులు ఈ సినిమాకి మైనస్ కానున్నాయి.

Advertisement
 

More

Related Stories