RRR2 గురించి రాజమౌళి మాట

Rajamouli, NTR and Ram Charan

‘బాహుబలి 3’ ఉంది, ‘బాహుబలి 4’ ఉంది అంటూ కొన్నాళ్ళూ రాజమౌళి మీడియాని మబ్బుల్లో పెట్టారు. తన సినిమాలకు ఎలా ప్రచారం చేసుకోవాలో బాగా తెలిసిన రాజమౌళి అలా కొన్నాళ్ళూ బాహుబలి సీక్వెల్స్ గురించి స్పందించారు. ఆ తర్వాత ‘బాహుబలి’ వెబ్ సిరీస్ అని హడావిడి జరిగింది. అది మొత్తానికి అటకెక్కింది.

ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్ 2’ అని మాట మొదలైంది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ రేసులో ఉంది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా అమెరికాలోని చాలామందికి తెగ నచ్చింది. పేరొందిన హాలీవుడ్ మేకర్స్ కూడా రాజమౌళి మేకింగ్ స్టయిల్ కి అబ్బురపడ్డారు. వాళ్ళే ఈ సినిమాకి ఆస్కార్ బజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాని ఎలాగైనా ఆస్కార్ రేసులో ఉంచాలని పట్టుదలగా ఉన్నారు. సో, దానికి కావాల్సిన ప్రచారం చేస్తున్నారు.

ఆ క్రమంలో చికాగోలో ఈ సినిమాని ప్రదర్శించారు. అక్కడ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ‘ఆర్ ఆర్ ఆర్ 2’ ఉంటుంది అని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు రాజమౌళి. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్ 2’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. సో, రాజమౌళి సక్సెస్ అయ్యారు.

మరి నిజంగా ‘ఆర్ ఆర్ ఆర్ 2’ ఉంటుందా? కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement
 

More

Related Stories