నిహారికఫై రూమర్లకు ఫుల్ స్టాప్

Niharika

నిహారిక కొణిదెలకు పుకార్లు కొత్త కాదు. కొన్నాళ్ళూ ఒక హీరోతో ప్రేమాయణం అంటూ రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత వెంకట చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల గురించి ప్రచారం జరిగింది. ఐతే, ఆ ప్రచారం నిజమైంది. ఆమె నిజంగానే పెళ్ళైన రెండేళ్లకే విడాకులు తీసుకొంది .

ఇక ఇటీవల ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం మొదలైంది. ఆమె తండ్రి నాగబాబు జనసేన తరఫున లోక్ సభకు పోటీ చెయ్యనున్నారు. తండ్రి బాటలోనే ఈ భామ కూడా జనసేనలో చేరి ఎన్నికల బరిలో దిగుతుంది అని ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పడ్డాయి.

కానీ ఆమె సోదరుడు, హీరో వరుణ్ తేజ్ అదంతా అబద్దమని తేల్చాడు. తన సోదరికి రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పాడు.

“ఆపరేషన్ వాలెంటైన్” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు వరుణ్. ఆ సమయంలోనే తన చెల్లెలు నిహారిక రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్న వస్తే వివరణ ఇచ్చాడు. “నిహారిక మళ్ళీ నటిస్తోంది. సినిమాలు, వెబ్ డ్రామాస్ చేస్తోంది. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదు,” అని చెప్పాడు వరుణ్ తేజ్.

Advertisement
 

More

Related Stories