- Advertisement -

సాయి పల్లవి తన తాతయ్య 85వ పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హీరోయిన్లు అందరూ తమ హాట్ హాట్ గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. కానీ, సాయి పల్లవి మాత్రం తన ఫ్యామిలీ ఫంక్షన్ల ఫొటోస్ ని ఎక్కువగా పెడుతుంటుంది.
అలా తన గ్రాండ్ పేరెంట్స్ తో దిగిన ఫోటోలు, తన చెల్లెలితో తీసుకున్న ఫోటోలని తాజాగా షేర్ చేసింది. వెండితెరపైనే కాదు రియల్ లైఫ్ లో కూడా సాయి పల్లవి సింప్లిసిటీకి మారుపేరు. సాధారణ మధ్యతరగతి కుటుంబ జీవనశైలిని పాటిస్తుంది సాయి పల్లవి.
మరోవైపు, ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’, మరోటి రానా సరసన నటించిన ‘విరాట పర్వం’.
సాయి పల్లవి కొత్త ఫోటోలు ఈ కింది ఇన్ స్టాగ్రామ్ లింక్ క్లిక్ చెయ్యండి.