సాయి తేజ్ కి అనేక ప్రొపోజల్స్!

హీరో సాయి దుర్గ (ధరమ్) తేజ్ తాజాగా “సంబరాల ఏటి గట్టు” అనే సినిమాలో నటిస్తున్నారు. “విరూపాక్ష” తర్వాత చేస్తున్న భారీ చిత్రం. మధ్యలో పవన్ కళ్యాణ్ తో “బ్రో” అనే సినిమా చేసినా సోలో హీరోగా చేస్తున్న భారీ చిత్రం మాత్రం “సంబరాలు ఏటి గట్టు.” ఈ సినిమా ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇలా ఒక్క సినిమాకే ఇంత టైం కేటాయించడం ఏంటి అని మెగాస్టార్ చిరంజీవి మందలించారట. దాంతో ఇప్పుడు మరిన్ని సినిమాలు ఒప్పుకునే పనిలో పడ్డాడు సాయి ధరమ్ తేజ్. ఇటీవల “రిపబ్లిక్ 2” చేస్తాను అని ప్రకటించారు. అది అవుతుందో లేదో కానీ ప్రస్తుతం సాయి తేజ పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారు.
2026లో కనీసం రెండు కొత్త సినిమాలు లైన్లో పెట్టాలనేది సాయి తేజ్ ప్లాన్. అలాగే వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకుంటాను అని ప్రకటించాడు. వచ్చే ఏడాది 40లో పడుతాడు సాయి తేజ్. అందుకే, కెరీర్, పెళ్లి విషయంలో సరైన పద్దతిలో వెళ్లాలని అనుకుంటున్నాడు.
మరి సాయి తేజ్ ఏ ప్రొపోజల్ కి ఓకె చెప్తాడో, ఏది ముందు చేస్తాడో చూడాలి.