సైలెంట్ గా సైఫ్ షూటింగ్

TeluguCinema 21 Jun 2023
Saif Ali Khan

‘ఆదిపురుష్’లో లంకేశుడిగా నటించాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఒకప్పుడు సైఫ్ హీరో… ఇప్పుడు విలన్ పాత్రలకు కేరాఫ్ అయ్యారు. ‘ఆదిపురుష్’లో రావణాసురిడిగా నటించినా ఎక్కడా ఈ సినిమా గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ప్రమోషన్ కి రాలేదు. తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకకు కూడా హాజరు కాలేదు.

ఇక ఇప్పుడు విడుదలైన తర్వాత రావణాసురిడి పాత్రని మలిచిన విధానంపై విమర్శలు చెలరేగాయి. ఇందులో సైఫ్ తప్పేం లేదు. దర్శకుడు ఓం రౌత్ చెప్పిన విధంగా కన్పించాడు, నటించాడు సైఫ్. ఐతే, ఈ వివాదాల నేపథ్యంలో అసలు బయట కనిపించడం లేదు సైఫ్.

ఆయన సైలెంట్ గా ఎన్టీఆర్ సినిమాలో పాల్గొంటున్నాడు. ఎల్లుండితో ‘దేవర’ సినిమాకి సంబంధించిన భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఎన్టీఆర్, సైఫ్ పై ఈ యాక్షన్ సీన్లు తీస్తున్నారు. ‘ఆదిపురుష్’ గొడవని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు సైఫ్.

సైఫ్ తీసుకున్న నిర్ణయం మెచ్చుకోవాల్సిందే. పెదవి విప్పితే, ప్రమోషన్ లో కన్పిస్తే ఇంకా వివాదం అవుతుంది. అందుకే, ఈ మౌనం.

Saif Ali Khan with NTR and Koratala Siva on 'Devara' sets

అన్నట్లు విలన్ గా కూడా హీరోల రేంజ్ లో పారితోషికం తీసుకునే నటుడు ఆయన. సో, ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి