పంచాంగం చూసి పెట్టిన డేట్

- Advertisement -
Salaar

“సలార్” సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఐతే, ఈ డేట్ ని ఆషామాషీగా నిర్ణయించలేదంట. “కొందరు పండితులకు చూపి, పంచాంగం చూసి ఈ తేదీని నిర్ణయించాం” అని చెప్తున్నారు నిర్మాత విజయ్ కిరంగదర్.

“సలార్” సినిమా అనేకసార్లు వాయిదా పడింది. ఐతే, సెప్టెంబర్ 28న రావడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అని చెప్పి చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఐతే, ఈ సినిమాని డిసెంబర్ 22న విడుదల చెయ్యాలా వద్దా అనే విషయంలో మాత్రం చాలా తర్జన భర్జన పడ్డామని నిర్మాత చెప్తున్నారు.

“ఆ రోజు చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి ఇబ్బంది అవుతుంది అని తెలుసు ఏప్రిల్ 2024 వరకు ఉన్న అనేక డేట్స్ పరిశీలించాం. కానీ మా జ్యోతిష్కుడు చెప్పిన డేట్ …డిసెంబర్ 22. అది ఈ సినిమా విడుదలకి మంచి ముహూర్తం, సమయం అన్నారు. దాంతో, మిగతా సినిమాలు ఉన్నా ఆ డేట్ ని ఫిక్స్ చేశాం,” అని చెప్పారు నిర్మాత.

డిసెంబర్ 22న షారుక్ ఖాన్ సినిమా “డంకి”తో పోటీ పడుతోంది “సలార్”.

More

Related Stories