సమంత… గిలిగింతలు పెట్టే ఫోజులు


సమంత వరుసగా యాడ్ ఫిలిమ్స్ చేస్తోంది.ఆమె చేతిలో ఎన్నో బ్రాండ్లున్నాయి. ఇన్ స్టాగ్రామ్ ప్రొమోషన్ తో కూడా బాగా సంపాదిస్తోంది. ఐతే, ఇటీవల ఆమె ఈ యాడ్స్ కోసం కొంచెం గ్లామర్ డోస్ పెంచింది అనిపిస్తోంది. ఇంతకుముందు చాలా సార్లు గ్లామర్ గా కనిపించింది. కానీ యాడ్స్ లలో ఎప్పుడూ ఓవర్ ఎక్స్ పోజింగ్ చెయ్యలేదు.

తాజాగా ఒక బ్యాగుల బ్రాండ్ కోసం ఆమె చేసిన యాడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమంత ఈ యాడ్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో పెద్దగా కవ్వించే ఫోజులు లేవు. కానీ వీడియోలో మాత్రం హాట్ హాట్ గా ఉందని అంటున్నారు.

ఈ బ్యాగుల యాడ్ వీడియో కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత ఇప్పుడు అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది.

ఇటీవలే గోవా ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చింది సమంత. లేటెస్ట్ గా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో తన కుక్కతో ఆడుకునే వీడియోలు లేదా తన యాడ్ షూట్ వీడియోలు ఎక్కువగా అప్లోడ్ చేస్తోంది.

Advertisement
 

More

Related Stories