సందీప్ రెడ్డి వంగ వరద సాయం

తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. దాదాపు 10 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బాహ్య ప్రపంచంతో చాలా ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. చాలా నష్టం వాటిల్లింది.
దీంతో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. వరద సహాయక చర్యల కోసం తమ వంతు సాయం అందిస్తున్నాడు. ఇందులో భాగంగా దర్శకుడు సందీప్ వంగ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు.
సోదరుడు ప్రణయ్ రెడ్డితో కలిసి వెళ్లి, సీఎంను గౌరవపూర్వకంగా కలిసిన సందీప్ రెడ్డి వంగ, తన వంతుగా సహాయ కార్యక్రమాల కోసం 10 లక్షల రూపాయల్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. ఈ మేరకు సీఎంకు చెక్కులు అందించాడు.
‘యానిమల్’ సినిమా సక్సెస్ తో ఊపుమీదున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.