Advertisement
తెలుగు న్యూస్

‘యానిమల్’ తర్వాత ప్రభాస్ తోనే!


దర్శకుడు సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. ఆ ఒక్క సినిమా అతన్ని అగ్ర దర్శకుల జాబితాలో కూర్చోబెట్టింది. ఇప్పుడు “కబీర్ సింగ్”తో బాలీవుడ్ లో కూడా టాప్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఇక అందరి చూపులు అతని రెండో బాలీవుడ్ మూవీ… “యానిమల్”పైనే.

డిసెంబర్ 1న విడుదల కానుంది… “యానిమల్”. ఈ చిత్రం విడుదలైన తర్వాత సందీప్ వంగా ఏ హీరోతో మూవీ తీస్తాడు? ఈ ప్రశ్న ఎందుకు ఉదయిస్తోంది అంటే ఆయన ఇప్పటికే ప్రభాస్ తో ఒక మూవీ, అల్లు అర్జున్ తో మరో మూవీ అనౌన్స్ చేశాడు. రెండూ కూడా టి. సిరీస్ సంస్థ నిర్మించనుంది. అధికారికంగా అనౌన్సమెంట్స్ వచ్చిన మాట నిజమే కానీ ఇందులో ఏది ముందు మొదలవుతుంది అనేదే ప్రశ్న.

ప్రభాస్ హీరోగా సందీప్ వంగా “స్పిరిట్” అనే సినిమా ప్రకటించాడు. ఇందులో ప్రభాస్ పోలీస్ గా నటిస్తాడు. ఐతే, ప్రభాస్ “కల్కి 2898 AD”, దర్శకుడు మారుతి చిత్రాలు పూర్తి చెయ్యాలి. ఈ రెండింటికి సంబందించిన పనులు వేసవికి పూర్తి అవుతాయని సమాచారం. సో, ఆ తర్వాత ప్రభాస్ తో షూటింగ్ చేసుకోవచ్చు.

ALSO READ: ఆయన దుబాయ్, ఈయన ఇటలీలో

అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ లో ఉన్నాడు. అది పూర్తి అయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ ఉంటుంది. అంటే 2024 మొత్తం ఈ సినిమాలతోనే బిజీగా ఉంటాడు. సో, అల్లు అర్జున్ – సందీప్ వంగా మూవీ ఇప్పుడే ఉండదు.

Advertisement

This post was last modified on November 2, 2023 9:52 am

Advertisement
Share