క్యాన్సర్ ని జయించిన సంజయ్ దత్

Sanjay Dutt

సంజయ్ దత్ క్యాన్సర్ ని జయించాడట. ఈ విషయాన్ని తనే బయటపెట్టాడు.

Advertisement

“ఈ రోజు నా పిల్లల పుట్టినరోజు. కొన్నాళ్లుగా ఒక వ్యాధితో జరిపిన యుద్ధంలో ఇదే రోజు నేను విజేతగా నిలవడం, నా పిల్లలకు ఇస్తున్న గొప్ప బహుమతి,” అంటూ పోస్ట్ చేశాడు దత్. అంటే… తాను క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నాడన్నమాట.

మూడు నెలల క్రితం దత్ కి లంగ్ క్యాన్సర్ అని గుర్తించారు డాక్టర్స్. వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ముంబైలోనే ట్రీట్ మెంట్ జరిగింది. ఇక్కడ చికిత్సకి అతని శరీరం స్పందించకపోతే …అమెరికా తీసుకెళ్లాలని అనుకున్నారు. ఐతే, మూడు నెలల్లోనే దాదాపుగా కోలుకున్నాడు. ఇక భయపడాల్సింది ఏమి లేదు. ఐతే, ట్రీట్మెంట్ కొనసాగుతుంది. డేంజర్ నుంచి బయటపడడంతో ఈ రోజు ఆనందంగా తాను కోలుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సంజయ్ దత్.

ఇప్పటికే దత్ …. “కేజేఎఫ్ 2” షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తాడు.

Advertisement
 

More

Related Stories