

2023 సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీపడ్డారు. వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలు ఇతర సినిమాలతో కలిసి విడుదల అయ్యాయి. రెండూ విజయం సాధించాయి.
ఇక 2024 సంక్రాంతికి వెంకటేష్, నాగార్జున తమ సినిమాలు విడుదల చేశారు. అందులో నాగార్జున నటించిన “నా సామి రంగ” మాత్రమే మోస్తరుగా ఆడింది.
ఇక 2025 సంక్రాంతికి అప్పుడే కర్చీఫ్ వేశారు చిరంజీవి, నాగార్జున. చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” సినిమా సంక్రాంతి 2025కే విడుదల కానుంది. ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల్లో చిరంజీవి షూటింగ్ మొదలుపెడుతారు. ఇక నాగార్జున ఏ సినిమా చేస్తాడో తెలియదు కానీ సంక్రాంతికి కలుద్దాం అంటూ తాజగా చెప్పారు.
సంక్రాంతి సమయంలో కొంచెం సినిమాలు అటు ఇటుగా ఉన్నా ఆడుతాయి. అందుకే, ఈ సీనియర్ హీరోలు పండగని నమ్ముకున్నారు.