- Advertisement -

మహేష్ బాబు కూడా షూటింగ్ షురూ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే నెల మొదటివారంలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు మహేష్ బాబు. కరోనా రెండో వేవ్ కారణంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు మహేష్.
‘సర్కారు వారి పాట’కి సంబంధించి కొంత భాగం అమెరికాలో షూటింగ్ తీయాలి. అమెరికాలో షూటింగ్ కి అనుకూలంగా లేదని 5 నెలల క్రితం దుబాయ్ లో 30 రోజుల పాటు తీశారు. ఇప్పుడు వీసా లభించి, అన్ని అనుకులిస్తే అమెరికాలో చిన్న షెడ్యూల్ పూర్తి చేద్దామని అనుకుంటున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. కీర్తి సురేష్ హీరోయిన్.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న తర్వాత … త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలుపెడతారు మహేష్ బాబు. సంక్రాంతికి విడుదల కానుంది ‘సర్కారు వారి పాట’