సీటీమార్ తెలివైన నిర్ణయం!


సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత పదే పదే మార్చాడాన్ని చూస్తున్నాం. రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” అనేకసార్లు తన రిలీజ్ డేట్ ని మార్చేసింది. ఈ సినిమా దసరా నుంచి వచ్చే ఉగాదికి పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో “సీటిమార్” నిర్మాతలు తమ సినిమా ఈ సెప్టెంబర్ లో విడుదల అవుతుందని పోస్టర్ విడుదల చేశారు. కానీ పక్కాగా డేట్ చెప్పలేదు. సెప్టెంబర్ లో ఏ రోజు విడుదల అవుతుంది అనేది తర్వాత చెప్తారట.

ఇటీవల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” నిర్మాతలు తమ సినిమా సెప్టెంబర్ 10న విడుదలవుతుందని ప్రకటించారు. ఇప్పుడు ఈ డేట్ ని మార్చాలని భావిస్తున్నారు. ఎందుకంటే, అదే రోజు ఓటిటి వేదికపై నాని నటించిన “టక్ జగదీష్”, నితిన్ నటించిన “మాస్ట్రో” విడుదల కానున్నాయి. ఓటిటి వేదికపై వచ్చే ఈ సినిమాలతో తమ సినిమా కలెక్షన్లకు దెబ్బ పడుతుందనేది ‘లవ్ స్టోరీ’ నిర్మాతల ఆందోళన. అందుకే, ‘లవ్ స్టోరీ’ని సెప్టెంబర్ 3కి కానీ, 17కి కానీ మార్చితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట.

ఈ నిర్మాతల కన్ఫ్యూజన్ చూసే… “సీటిమార్” మేకర్స్ తమ డేట్ ప్రకటించలేదు. “లవ్ స్టోరీ” నిర్మాతలు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత చెప్తారట. ఇది తెలివైన నిర్ణయం. మళ్ళీ డేట్స్ మారిస్తే… సినిమాపై లుక్ పోతుంది.

గోపీచంద్, తమన్న జంటగా నటించిన “సీటిమార్” కబడ్డీ నేపథ్యంలో సాగి మాస్ ఎంటర్ టైనర్. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గోపీచంద్, తమన్న కబడ్డీ జట్ల కోచులుగా నటించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ పాటలు ఇచ్చారు.

Advertisement
 

More

Related Stories