ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రెగ్నెంట్?

ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రెగ్నెంట్?

వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొని ఈమధ్యే ఏడాది దాటింది. కోలీవుడ్ మోస్ట్ ఎట్రాక్టివ్ కపుల్ గా పేరుతెచ్చుకున్న ఆర్య-సాయేషా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారట. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ ఇదే.

ఆర్య-సాయేషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. “గజనీకాంత్” అనే సినిమాతో కలిసిన వీళ్లిద్దరూ అలా ప్రేమలో పడ్డమే కాకుండా, ఇలా పెళ్లి చేసుకున్నారు. గతేడాది మార్చిలో వీళ్లిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అలా పెళ్లయిన ఏడాదికే సాయేషా గర్భవతి అయినట్టు తెలుస్తోంది. దీనికి ఓ చిన్న లాజిక్ కూడా చెబుతోంది కోలీవుడ్ మీడియా.

గత నెలలో సాయేషా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. అందులో ఆమె కాస్త లావుగా కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో వీడియో పెట్టింది. అందులో ఆమె లూజ్ గా ఉండే సల్వార్ డ్రెస్ వేసుకుంది. ఆమె నడక కూడా చాలా నెమ్మదిగా ఉంది. ఈ రెండు వీడియోల ఆధారంగా సాయేషా ప్రెగ్మెంట్ అయిందంటూ కోలీవుడ్ మీడియా కథనాలు వండివార్చేస్తోంది.

ఇలాంటి విషయాలు దాచిపెడితే దాగేవి కావు. కాబట్టి కచ్చితంగా త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రావడం గ్యారెంటీ. పైగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే సాయేషా ఇలాంటి విషయాల్ని షేర్ చేయడానికి అస్సలు మొహమాటపడదు. లెట్స్ సీ….

 

More

Related Stories