ఆ సినిమాలో బాగున్నాను: శిల్పాశెట్టి

shilpashetty stlls 110725 05

50 ఏళ్ల శిల్పాశెట్టి ఇప్పటికీ స్లిమ్ గా ఉంటుంది. ఆమె బాడీ విషయంలో ఎవరూ వంక పెట్టలేరు. కానీ తన అందం మాత్రం పాతికేళ్ల క్రితం సూపర్ గా ఉంది అని ఆమె చెప్తోంది.

శిల్పాశెట్టి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించింది. 30 ఏళ్ల కెరీర్లో ఆమె అనేక సినిమాల్లో నటించింది. ఐతే, తాను నటించిన సినిమాల్లో “ధడ్కన్” ప్రత్యేకం అని చెప్తోంది. ఆ సినిమాలో తన లుక్ తనకే ముచ్చటేస్తుందట

“ధడ్కన్ లో క్లాస్, మాస్ కలిసిన విధానం అద్భుతం. మనీష్ మల్హోత్రా, విక్రమ్ ఫడ్నిస్ నా దుస్తులు డిజైన్ చేశారు. ఆ సినిమాలో మెడవరకు నిండుగా ఉండేలా డిజైన్ చేశారు. అస్సలు క్లీవేజ్ చూపించలేదు. అయినా నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తాను ఆ సినిమాలో ఆ సినిమాలో నా లుక్ అప్పటి అమ్మాయిలకు ఫ్యాషన్ అయింది. ఆ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 25 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నారు,” అని ఆమె తాజాగా చెప్పింది.

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ఆమె కెరీర్లో పెద్ద హిట్. అక్షయ్ తో ఆమె అనేక సినిమాల్లో నటించింది. ఆ టైంలో ఆమె అక్షయ్ కుమార్ తో డేటింగ్ లో ఉంది. ఈ సినిమా విడుదల టైంకి వీరి రిలేషన్ కి శుభం కార్డ్ పడింది.

తనతో డేటింగ్ చేస్తూనే ట్వింకిల్ ఖన్నాతో ఎఫైర్ మొదలుపెట్టాడని గ్రహించింది శిల్పా శెట్టి. దాంతో అక్షయ్ తో బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ట్వింకిల్ ఖన్నాని అక్షయ్ కుమార్ పెళ్లాడారు.

అలాగే చీర తనకు ఇష్టమైన డ్రెస్ అని చెప్తోంది.

More

 

Related Stories