తమిళంలో శివాత్మికకి అవకాశాలు!


రాజశేఖర్ కూతురు శివాత్మిక ఇప్పటికే తెలుగులో ‘దొరసాని’ అనే సినిమాలో నటించింది. కృష్ణవంశీ తీస్తున్న ‘రంగ మార్తాండ’లో కూడా ఒక పాత్ర పోషిస్తోంది. కానీ, ఎందుకో ఆమెకి పెద్దగా క్రేజ్ రాలేదు. అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రాలేదు. దాంతో తమిళం వైపు చూపు వేసింది. అక్కడ రెండో సినిమా సైన్ చేసింది.

యువ హీరో అశోక్ సెల్వన్ నటిస్తున్న కొత్త సినిమాలో రీతూ వర్మతో పాటు ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి కూడా నటిస్తున్నారు. ఆ సినిమాలో మరో భామగా శివాత్మిక నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రకటించారు.

రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు శివాని, రెండో కూతురు శివాత్మిక. ఇద్దరూ హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కాకపోతే, ఇప్పటికీ వాళ్ళ తల్లితండ్రుల పేరుతోనే గుర్తింపు ఉంది. అందరూ గుర్తుపట్టే క్రేజ్ ఇంకా రాలేదు.

శివాత్మిక తమిళ సినిమాలు చేసి కొంత పాపులర్ అవుదామని ప్రయత్నిస్తోంది.

Advertisement
 

More

Related Stories