మా ఆయన మంచోడు: శిల్పాశెట్టి

TeluguCinema 15 Jun 2021
shlipa shetty 1

ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రే రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఐతే, నా భర్త బంగారం, ఆయన మంచోడు అంటోంది శిల్పా.  మంచోడికి కోపం వస్తే అలాగే ఉంటుందంటూ రాజ్ కుంద్రే గురించి సోషల్ మీడియాలో శిల్పాశెట్టి పోస్టులు పెడుతోంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే…. రాజ్ కుంద్రే తన మొదటి భార్య నుంచి విడిపోయి శిల్పా శెట్టిని 2009 నవంబర్లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల తర్వాత రాజ్ కుంద్రే మొదటి భార్య ఆరోపణలు చేసింది. శిల్పా వల్లే తన కాపురంలో చిచ్చు రేగిందని, ఆమె లేకపోతే తాము కలిసి ఉండేవారమని రీసెంట్ గా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

దాంతో, రాజ్ స్పందించారు. అసలు తాను మొదటి భార్య నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో బయటపెట్టారు రాజ్ కుంద్రే .

రాజ్ చెప్పిన దాని ప్రకారం.. అతని మొదటి భార్య ఆయన​ సొంత చెల్లెలు భర్తతో ఆమె సంబంధం పెట్టుకుంది. అది తెలిసిన తర్వాతే ఆమె నుంచి విడిపోయారట. “ఇన్నాళ్లూ ఈ విషయం ఎక్కడా చెప్పలేదు, మౌనం పాటించాను. కానీ ఆమె నన్ను రివర్స్ లో బద్నామ్ చేసేందుకు ట్రిక్స్ వేసింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. శిల్పా శెట్టిది ఇందులో తప్పు లేద,”ని రాజ్ చెప్పారు.

Also Check: Photos: Shilpa Shetty’s sizzling style

Raj Kundra and Shilpa Shetty Kundra

ఇక ఇప్పుడు శిల్పా తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై నర్మగర్భంగా పోస్టులు వస్తున్నాయి. అవన్నీ తన భర్త మాజీ భార్య గురించి అని చెప్పక్కర్లేదు. “ఒక మంచోడికి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో చూశారు కదా..​.​” అంటూ రాసుకుంటోంది.

శిల్పా శెట్టి తెలుగులో ‘సాహసవీరుడు సాగర కన్య’, ‘వీడెవ్వడు బాబూ’, ‘ఆజాద్’ వంటి సినిమాల్లో నటించారు. త్వరలో మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో రీ-ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.