మహేష్, సితార వైరల్ పిక్ ఇదే

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ ఇది. మహేష్ బాబు, కూతురు సితార మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తమ మధ్య ప్రేమను మరింత తెలిపేలా ఉంది ఈ ఫొటో. #waybackwednesday కాన్సెప్ట్ తో స్వయంగా సితార రిలీజ్ చేసిన పిక్ ఇది.

ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ఇష్టపడతాడు. మహేష్ అలా సితార, గౌతమ్, నమ్రతతో కలిసి ఫారిన్ టూర్ కు వెళ్లిన సందర్భంలో ఓ ఎయిర్ పోర్ట్ లాంజ్ లో తీసిన ఫొటో ఇది.

ఇందులో మహేష్ ఒడిలో సితార రెస్ట్ తీసుకుంటోంది. రెస్ట్ తీసుకోవడానికి ఈ ప్రపంచంలో ఇంతకంటే బెటర్ ప్లేస్ ఏముంటుందంటూ ఓ స్టేట్ మెంట్ కొట్టి మరీ ఈ ఫొటో రిలీజ్ చేసింది సితార. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఈ ఫొటోను లైకులతో తడిపేస్తున్నారు. రీట్వీట్లు-షేర్లతో ముంచేస్తున్నారు.

Related Stories