Advertisement
తెలుగు న్యూస్

స్కంద 2 ఇప్పుడే కాదు!

బోయపాటి శ్రీను, హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందిన “స్కంద” ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే మొదటి రోజు రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు ఫర్వాలేదు.

సోమవారం (అక్టోబర్ 2 హాలిడే) కలెక్షన్ చూపించగలదు ఈ సినిమా. ఐతే, మంగళవారం తర్వాత ఎలా నిలబడుతుందో చూడాలి.

ఇక ఈ సినిమా చివర్లో “స్కంద 2” ఉంటుంది అని చూపించారు. ఈ సినిమాలో రామ్ పోతినేని రెండు పాత్రలు చేశాడు. రెండో పాత్రలో కనిపించిన రామ్ గురించి పూర్తిగా వివరాలు ఈ సినిమాలో చెప్పలేదు. మొరాకోలో ఒక ముప్ఫైమందిని మట్టుపెట్టిన వాడే వీడు అంటూ ఒక డైలాగ్ మాత్రం ఆ పాత్ర గురించి చెప్పి సినిమాని ఎండ్ చేశారు. సో, సీక్వెల్ లో ఆ రెండో పాత్రనే మెయిన్ హైలెట్ గా ఉంటుంది అన్నమాట.

ఐతే, “స్కంద 2” ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం. బోయపాటి “అఖండ 2” కూడా ప్రకటించారు. అది పూర్తి అయ్యిన తర్వాత ఎప్పుడో రామ్ డేట్స్ ని బట్టి ఉంటుందేమో.

ALSO READ: స్కంద – తెలుగు రివ్యూ

Advertisement

This post was last modified on September 30, 2023 1:52 pm

Advertisement
Share